Visakha లో కీలక మూడో టీ20 కోసం భారత్, సౌతాఫ్రికా జట్లు విశాఖపట్నానికి చేరుకున్నాయి. మంగళవారం ఇరు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కోసం ఇరు జట్లు సాగరనగరానికి వచ్చాయి. ఎయిర్ పోర్టు లో అధికారులు టీమిండియా, సౌతాఫ్రికా ప్లేయర్లకు స్వాగతం పలికారు. విశాఖలో జరిగే మూడో మ్యాచ్ లో గెలిచి 5టీ20ల సిరిస్ రేస్ లో నిలవాలని భారత్ భావిస్తోంది.